మీరపలో సమగ్ర యాజమాన్య పద్ధతులు
విత్తన మోతాదు :
- సంకర రకం : సెంటుకి 80 నుండి 100 గ్రా. విత్తనము ఒక ఎకరానికి సరిపోతుంది.
- ట్రే పద్దతిలో : 70 - 80 గ్రా. విత్తనము ఒక ఎకరానికి సరిపోతుంది.
విత్తనశుద్ది :
- సమగ్ర సస్య రక్షణ విధానంలో విత్తన శుద్ది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
- F1 హైబ్రిడ్ విత్తనం శుద్ది చేసే వస్తుంది.
నారుమడి యాజమాన్యం :
- ఒక సెంటు అనగా (40 చ. మీ.) నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరము పొలములో నాటడానికి సరిపోతుంది.
- తామర పురుగుల నుండి రక్షణకు ఫిప్రొనిల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
- విత్తిన 9 మరియు 15 రోజుల తరువాత నారుమడికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి నారుమడి తడిపి నారుకుళ్ళు తెగులును అదుపు చేయవచ్చు.
- ఆరు వారాల వయసుగల నారు మొక్కలు నాటడానికి అనుకూలం.
ట్రే పద్ధతిలో నారు పెంపకం :
- 98 గుంతలుగల ప్లాస్టిక్ ట్రేలను ఎంచుకోవాలి.
- కోకోపిట్ ను ట్రేలో నింపే ముందు 1 కిలో ట్రైకోడెర్మావిరిడి 300 కిలోల కోకోపిట్ తో బాగా కలపాలి.
- ట్రేను కోకోపీట్ తో నింపిన తరువాత ప్రతి గుంతలో ఒక విత్తనాన్ని నాటాలి.
- మొక్కల పెరుగుదలను బట్టి 5 నుండి 7 రోజులకి ఒకసారి నీటిలో కరిగే ఎరువులను పిచికారి చేయాలి.
సమగ్ర పోషక యాజమాన్యం :
- పశువుల ఎరువులు (ఎకరాకు): 8 - 12 టన్నులు
- వానపాముల ఎరువులు (ఎకరాకు): 1 - 2 టన్నులు
- నత్రజని (ఎకరాకు): 80-120 కీ.గ్రా
- భాస్వరం (ఎకరాకు): 80-100 కీ.గ్రా
- పొటాషియం (ఎకరాకు): 60-75 కీ.గ్రా
నీటి యాజమాన్యం :
- మొక్కలు నేలలో బాగా స్థిరపడటానికి నాట్లు వేసిన వెంటనే మొదటి నీటిపారుదల ఇవ్వబడుతుంది.
- నాట్లు వేసిన 10 రోజుల తర్వాత రెండవ నీటిపారుదల ఇవ్వబడుతుంది.
- సాధారణంగా వర్షపాతం, నేల రకం, తేమ మరియు ఉష్ణోగ్రతను బట్టి 8 నుండి 9 నీటిపారుదలలు ఇవ్వబడతాయి.
కలుపు యాజమాన్యం :
- మిరపకాయ నెమ్మదిగా పెరిగే పంట కాబట్టి, అది దూకుడుగా ఉండే కలుపు మొక్కలతో పోటీ పడదు.
- కలుపు మొక్కలు లేకుండా ఉండేలా చూసుకోవడానికి చేతితో కలుపు తీయడం అవసరం.
చీడపీడల యాజమాన్యం :
- తామర పురుగులు : డైఫెన్థయురాన్ 50% డబ్ల్యూ.పి. 1.25 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8%.
- తెల్లనల్లి : ఫెనాజాక్విన్ 10% ఎస్.సి. 2.5 మి.లీ.
- పేనుబంక : ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్.ఎల్. 0.3 మి.లీ.
తెగుళ్ల యాజమాన్యం :
- నారుకుళ్ళు : కాపర్ ఆక్సీక్లోరైడు 8 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి మొక్కలు తడిచేటట్లు పిచికారి చేయాలి.
- కొమ్మ మరియు కాయకుళ్ళు తెగులు : మెటిరామ్ 2 గ్రా. లేదా టెబుకొనజోల్ + ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ 1 గ్రా.
మిరప పంటలో పురుగు మందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :
- పంటపై లక్షణాలను బట్టి ఏ పురుగు ఆశించినదో గుర్తించి దానికి సిఫారసు చేసిన మందును మాత్రమే పిచికారి చేయాలి.
- రెండు, మూడు మందులు కలిపి పిచికారి చేయరాదు.
- పురుగు మందులు పిచికారి చేసిన తరువాత కాయలు కోయటానికి కొంత సమయం ఇవ్వాలి.
పైరు కాయలు పూర్తిగా పక్వానికి వచ్చిన తరువాత :
- కాయలను శుభ్రమైన కళ్ళాలో ఆరబెట్టుకోవాలి.